శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 4 జూన్ 2024 (10:32 IST)

20 వేల ఓట్ల మెజారిటీతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, పరాజయం బాటలో జగన్ మంత్రులు

pawan kalyan
జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం 20 వేల ఓట్ల మెజారిటీతో ముందంజలో వున్నారు. పవన్ కల్యాణ్ పార్టీ జనసేన పోటీ చేసిన మొత్తం 21 స్థానాలకు గాను 18 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ 123 స్థానాల్లో ముందంజలో వుంది. భారతీయ జనతా పార్టీ 6 చోట్ల ముందంజలో సాగుతోంది.
 
ఇక అధికార పార్టీ కేవలం 23 చోట్ల మాత్రమే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మినహా మంత్రులందరూ వెనుకంజలో సాగుతున్నారు. ఏపి ప్రజలంతా సంక్షేమం ఒక్కటే కాదనీ, ఏపీ అభివృద్ధి ముఖ్యమన్న కోణంలో ఓటింగ్ చేసారని ఈ ట్రెండ్స్ చూస్తే అర్థమవుతుంది.