శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారంలో పాము కళేబరం .. ఎక్కడ?

dead snake
ఏపీలోని చిత్తూరు జిల్లాలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే పౌష్టికాహారంలో పాకు కళేబరం వెలుగు చూసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యెం మండలంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో ఘటన వెలుగుచూసింది. పౌష్టికాహారం ప్యాకెట్‌ను ఇంట్లో విప్పిచూడగా పాము కళేబరం కనిపించడంతో ఆ గర్భిణీ మహిళ ఒక్కసారిగా షాక్‌కుగురైంది. ఆ తర్వాత అంగన్‌వాడీ సూపర్ వైజర్ సాయంతో సీడీపీఓకు బాధితురాలు ఫిర్యాదు చేయగా, దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని సీడీపీఓ వెల్లడించారు. 
 
బంగారువాలళ్యెం మండలం జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో మానస అనే గర్భిణీకి ఈ పౌష్టికాహార ప్యాకెట్‌ను ఇచ్చారు. ఇది ఖర్జూల ఫలాల ప్యాకెట్. దాన్ని విప్పి చూడగా,  ఖర్జూలాలు ఎండిపోయివుండగా, అందులే పాము కళేబరం కనిపించింది. ఈ దృశ్యంతో అవాక్కైన మహిళ అంగన్‌వాడీ కేంద్రం సూపర్ వైజర్‌కు ఫిర్యాదు చేశారు.