గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (13:34 IST)

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు స్వాగతం కలికిన సీఎం జగన్

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేశారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన ఆయనకు చిప్పిలి హెలిపాడ్‌ వద్ద ముఖ్యమంత్రి జగన్‌ స్వాగతం పలికారు. అక్కడ నుంచి బయలుదేరి మదనపల్లె సమీపంలోని సత్సంగ్‌ ఫౌండేషన్‌ వద్దకు రాష్ట్రపతి చేరుకున్నారు. 
 
అక్కడ భారత్‌ యోగా విద్యా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. సత్సంగ్‌ విద్యాలయాన్ని సందర్శించి, విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. తర్వాత 38 పడకల స్వస్థ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సదుం మండలం పీపుల్స్‌గ్రోవ్‌ స్కూలుకు చేరుకుని విద్యార్థులతో ముచ్చటిస్తారు.