గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 మార్చి 2022 (12:02 IST)

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వాల్తేరు డివిజన్‌ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదించినట్లుగా తెలిపారు. 
 
రైల్వేజోన్‌కు డీపీఆర్‌ సమర్పించాక కొత్త రైల్వేజోన్‌, రాయగడ రైల్వే డివిజన్‌ ఏర్పాటులో భాగంగా పరిధి - ఆదాయ వ్యవహారాలకు సంబంధించి అనేక విషయాలు తమ దృష్టికి రావటంతో వీటిని మరింతగా అధ్యయనం చేయటం కోసం అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ లెవెల్‌ కమిటీని ఏర్పాటుచేశామని రైల్వే మంత్రి వెల్లడించారు. 
 
బీజేపీ రాజ్యసభ సభ్యుడు నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కొత్త రైల్వేజోన్‌, రాయగడ డివిజన్‌ ఏర్పాటుకోసం 2020-21 బడ్జెట్‌లో రూ.170 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.