శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 8 మే 2021 (19:06 IST)

ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు: వాతావరణశాఖ

పలు రాష్ట్రాల్లో వింత వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఎండలు భారీగా పెరుగుతుంటే.. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఎండలతో అల్లాడుతున్న ప్రజలు ఈ వర్షాలతో కొంత ఉపశమనం కలిగిస్తోంది.

కాగా.. కొన్ని రోజుల ఉపరితల ఆవర్తనంతో నుంచి తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల పంటలకు, మామిడితోటలకు నష్టం వాటిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనను విడుదల చేసింది.

ఈ రోజు, శనివారం, ఆదివారం వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. దక్షిణ కోస్తా ఆంధ్రాలో శనివారం, ఆదివారం ఉరుములు, మెరుపులతో పాటు ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
 
రాయలసీమలో.. కూడా  శనివారం, ఆదివారం ఉరుములు, మెరుపులతో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాంకుండా పలుచోట్ల పిడుగులు పడే సూచనలు కూడా ఉన్నాయని తెలిపింది.