బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 7 మే 2021 (20:48 IST)

తిరుమలలోని ఆస్థాన మండపం వద్ద జరిగింది అగ్నిప్రమాదం కాదు, ఆత్మహత్య

తిరుపతి: తిరుమలలోని ఆస్థాన మండపం వద్ద మూడ్రోజుల కిందట జరిగిన అగ్నిప్రమాదంలో 20 దుకాణాలు దగ్ధం కాగా.. ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు.. షాపు నం.84 యజమాని మల్లిరెడ్డి పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడంతోనే మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించాయని తెలిపారు.

ఈ ఘటనకు ముందు మల్లిరెడ్డి తన ఫోన్‌ను స్నేహితుడికి ఇచ్చినట్లు గుర్తించిన పోలీసులు.. దర్యాప్తు చేయగా అందులో కుటుంబకలహాలు ఉన్నట్లు సెల్ఫీ వీడియోలో మల్లిరెడ్డి ప్రస్తావించినట్లు తేలింది.

అతను పెట్రోల్‌ క్యాన్‌ తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా స్థానిక సీసీ కెమెరాలో నమోదైయ్యాయి. దీంతో పోలీసులు మల్లిరెడ్డిది ఆత్మహత్యగా నిర్థారించారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.