మాస్కులు లేకుండా వీధుల్లో యువత: బాపట్ల ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆగ్రహం

Kona Raghupati
ఎం| Last Updated: శుక్రవారం, 7 మే 2021 (15:37 IST)
సహజంగా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటూ ఏ విషయంలోనూ తొందర పడకుండా నవ్వుతూ అందరినీ పలకరించి పనిచేసే బాపట్ల ఎమ్మెల్యే, ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి ఒక విషయం లో కోపం వచ్చింది.

కరోనా కట్టడికి అందరూ ఎంతో కష్టపడుతున్నారు. ఇంకా వీధుల వెంట కొంతమంది మాస్కులు లేకుండా నిర్లక్ష్యంగా తిరుగుతూ అసలు పని లేకపోయినా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి కరోనా వ్యాప్తికి సాధనాలుగా ఉపయోగపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన
నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న యువకులపై అసహనాన్ని వ్యక్తం చేశారు.

తీవ్ర సంక్షోభం ఉన్న ఈ సమయంలో ఒక ఆశా కిరణం ఇది. ఈ అపూర్వమైన COVID వేవ్ -2 పరిస్థితిని పరిష్కరించడానికి బాపట్ల ప్రజలు మరియు పరిపాలనా బృందానికి సాధ్యమైనంత సహాయాన్ని పొందడంలో బాపట్ల ఏరియా ఆసుపత్రికి ఆక్సిజన్ ప్లాంట్ మంజూరు చేయబడింది. బాధ్యతాయుతమైన పౌరులుగా మనమందరం కూడా మన వంతు కృషి చేయాలి. ఆ పని చాలా సులభం. ఇంట్లోనే ఉండండి..అత్యవసరం అయ్యితే తప్పా బయటకు రావొద్దు.

మాస్క్ లు ధరించకుండా చాలా మంది వీధుల్లో తిరుగుతున్నట్లు మనం ఇంకా చూస్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ .. ఇంట్లో ఉండండి.. సురక్షితంగా ఉండండి .. మన సమాజాన్ని సురక్షితంగా ఉంచండి. అంటూ ఆయన వేడుకున్నారు.దీనిపై మరింత చదవండి :