శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2017 (07:24 IST)

ఆ క్రెడిట్ అంతా రాజమౌళిదే : సీఎం చంద్రబాబు

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఆకృతులను ఖరారు చేయడంతో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అత్యంత కీలక పాత్రను పోషించారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఒక్క అసెంబ్లీ మిన‌హా రాజ‌ధాని భ‌వనాల ఆకృ

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఆకృతులను ఖరారు చేయడంతో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అత్యంత కీలక పాత్రను పోషించారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఒక్క అసెంబ్లీ మిన‌హా రాజ‌ధాని భ‌వనాల ఆకృతులు ఖ‌రారు చేసినట్టు ఆయన తెలిపారు. 
 
తొమ్మిది రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని స్వదేశానికి వచ్చిన చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం అమరావతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ మిన‌హా రాజ‌ధాని భ‌వనాల ఆకృతులు ఖ‌రారు అయ్యాయ‌ని తెలిపారు. సంక్రాంతికి రాజ‌ధానిలో శాశ్వ‌త భ‌వ‌నాల నిర్మాణ ప‌నులు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. 
 
సినీ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అనేక మంచి సూచ‌న‌లు చేశార‌ని, ఈ విషయంలో ఆయన కీలకంగా వ్య‌వ‌హ‌రించారని చ‌ంద్ర‌బాబు ప్ర‌శంసించారు. మ‌రో 40 రోజుల్లో అసెంబ్లీ ఆకృతులను పూర్తిగా ఖ‌రారు చేస్తామ‌న్నారు. పోల‌వ‌రం నిర్మాణానికి నిధుల‌ ఇబ్బంది ఉందని, త్వ‌ర‌లోనే ఆ అడ్డంకులు తొల‌గిపోతాయని ముఖ్యమంత్రి అన్నారు.