గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 8 సెప్టెంబరు 2018 (11:05 IST)

రేవ్ పార్టీ పేరుతో ఏడుగురు మహిళలతో 20 మంది పురుషులు.. ఎంజాయ్

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో రేవ్ పార్టీ పేరుతో ఏడుగురు మహిళలతో 20 మంది పురుషులు ఎంజాయ్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో రేవ్ పార్టీ పేరుతో ఏడుగురు మహిళలతో 20 మంది పురుషులు ఎంజాయ్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తాజాగా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం దేవరాతిగూడెం వద్ద ఏ-వన్‌ రిసార్ట్‌లో శుక్రవారం రాత్రి రేవ్‌ పార్టీ జరిగింది. ముందస్తు సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆ సమయంలో ఏడుగురు మహిళలతో కలిసి 20 మంది పురుషులు మద్యం సేవిస్తూ, నృత్యాలు చేస్తూ, ఇతర అసభ్యకరచర్యల్లో నిమగ్నమైవున్నారు. 
 
దీంతో వీరందరినీ వీరితో పాటు నిర్వాహకుడు రమణ మహర్షిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనాస్థలం నుంచి ఐదు కార్లతో పాటు కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారనే దానిపై కూపీ లాగుతున్నారు.