బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 జనవరి 2024 (10:18 IST)

టీడీపీకి షాక్.. చంద్రబాబు ఫోటోను దించేసిన రాయపాటి రంగారావు

tdpflags
గుంటూరు జిల్లాలో టీడీపీకి షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నాలుగు సార్లు గుంటూరు ఎంపీగా గెలిచిన రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు తెలుగుదేశం నుంచి తప్పుకున్నారు. టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి ఆయన లేఖ ద్వారా రాజీనామా సమర్పించారు.
 
ఇందులో భాగంగా తన ఆఫీస్ లో టీడీపీ బాస్ ఫోటోను దించేశారు. రాయపాటి కుటుంబం గత కొన్నేళ్లుగా టీడీపీలో కొనసాగుతుండగా, 2019లో గుంటూరు జిల్లాలో తన కుమారుడు రంగారావుకు టీడీపీ ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించాలని సీనియర్‌ నేత సాంబశివరావు ప్రయత్నించగా, ఆ ప్రతిపాదనను చంద్రబాబు తిరస్కరించారు. 
 
మళ్లీ 2024లో, బాబు రంగారావుకు టిక్కెట్టును తిరస్కరించారు. దీని ఫలితంగా రంగారావు టిడిపిని విడిచిపెట్టారు.