గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 16 నవంబరు 2022 (10:52 IST)

తూగో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురి మృతి

road accident
తూర్పుగోదావరి జిల్లా గుండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగంది. 13 మందితో వెళుతున్న వాహనం నియంత్రణ కోల్పోయి రోడ్డుపక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం బుధవారం తెల్లవారుజామున జరిగింది. 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఏలూరు జిల్లాలోని వివధ గ్రామాలు, మండలలాకు చెందిన 13 మంది టాటా మ్యాజిక్ వాహనంలో అనకాపల్లి జిల్లా కశింకోటలోని పరమటమ్మ తల్లి ఆలయానికి వెళుతున్నారు.

ఈ క్రమంలో గుండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ శివారులో వీరు ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్ వాహనం అదుపుతప్పి జాతీయ రహదారి పక్కన ఆగివున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నల్లజర్లకు చెందిన డ్రైవర్ కొండా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
 
ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడగా వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ప్రసాద్ (48), మహేశ్ (28), మంగ (36), మణికంఠ (25) అనేవారు చనిపోయారు. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపతున్నారు.