సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 మార్చి 2017 (13:00 IST)

జగన్ మాటనే ఎందుకలా.? మీడియా టాపిక్‌ను డైవర్ట్ చేయొద్దు: రోజా విజ్ఞప్తి

బస్సు ప్రమాద ఘటన బాధితులకు జరిగిన నష్టాన్ని ప్రశ్నిస్తే.. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంటే వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై ఎందుకు కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. ఆంధ్ర‌ప్ర‌దే

బస్సు ప్రమాద ఘటన బాధితులకు జరిగిన నష్టాన్ని ప్రశ్నిస్తే.. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంటే వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై ఎందుకు కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నందిగామ ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం కలెక్టరుతో ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలొస్తున్న తరుణంలో.. రోజా స్పందించారు.
 
ఆస్పత్రిలో జగన్‌తో అధికారులు సరిగ్గా ప్రవర్తించలేదని చెప్తున్నారే.. ఏ రాష్ట్రంలోనైనా ఓ ఐఏఎస్ ఇలా ప్రతిపక్ష నేతతో మాట్లాడిన దాఖలాలున్నాయా? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. జగన్ మాట్లాడిన ఒక్క మాట క్లిప్పింగ్‌ను పదే పదే వేసి టాపిక్‌ డైవర్ట్ చేయాలని చూడొద్దన్నారు. బాధితుల‌కు న్యాయం చేయాల్సిన ప‌రిస్థితుల్లోనే జ‌గ‌న్ క‌లెక్ట‌ర్‌తో వాద‌న‌కు దిగాల్సి వ‌చ్చిందని, మీడియా సోదరులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.. ఇలాంటి ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. 
 
మీడియా జ‌గ‌న్ మాట్లాడిన ఆ ఒక్క‌మాట‌నే చూపిస్తూ.. బ‌స్సు ప్ర‌మాదంలో మృతి చెందిన‌ ఆ ప‌ద‌కొండు మంది ఆత్మ‌ల‌కి శాంతిలేకుండా చేయొద్దని అన్నారు. 11మంది ప్రాణాలు తీసిని ఆ జేసీ యాజ‌మాన్యాన్ని టీడీపీ ప్ర‌భుత్వ నేత‌లు ఎందుకు ప్ర‌శ్నించ‌లేదని రోజా అడిగారు. అన్నింటికీ నోరుందని ముందుకొచ్చే దేవినేని ఉమ దీనిపై ఎందుకు స్పందించట్లేదని అడిగారు.