శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (14:14 IST)

వెస్ట్ గోదావరిలో విషాదం... వాగులో పడిన బస్సు - పది మంది మృతి

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు వాగులోపడిన ఘటనలో పది మంది వరకు మృత్యువాతపడ్డారు. ఈ బస్సు వంతెనపై వెళుతుండగా, నియంత్రణ కోల్పోయిన వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పది మంది మృతి చెందగా, ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 
 
కాగా, బస్సు ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నుంచి జంగారెడ్డి గూడెంకు వెళుతుండగా జల్లేరు వాగులో ప్రమాదవశాత్తు పడిపోయింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, అధికారులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.