శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2020 (14:24 IST)

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత : సర్కారు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించలేమని సర్కారు చెబుతోంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీచేసింది. 
 
దేశంలో లాక్‌‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. ఈ కరోనా వైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయింది. 
 
దీంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తోంది. ఇప్పటికే మార్చి నెల వేతనాల్లో కోత విధించింది. అలాగే, ఏప్రిల్ నెల వేతనాల్లో కూడా కోత విధించనున్నట్టు పేర్కొంది. 
 
కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వరుసగా రెండో నెల కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తూ ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు జారీచేసింది. వివిధ స్థాయిల్లో జీతాల్లో కోతలు పెడుతున్నట్లు ప్రకటించింది. అయితే రిటైర్డ్‌ ఉద్యోగులకు మాత్రం పూర్తి పింఛన్లు అందిస్తామని పేర్కొంది.