శ్రీకాకుళంలో అడుగుపెట్టిన కరోనా వైరస్ - 3 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా, కరోనా వైరస్ వ్యాపించని జిల్లాలు రెండు ఉన్నాయి. అవే... శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు. అయితే, ఇందులో శ్రీకాకుళం జిల్లాలో తాజాగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు చేసుకున్నాయి. మూడు పాజిటివ్ కేసులు నమోదైనట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన హెల్త్ బులిటెన్ మేరకు... ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 61 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మొత్తం 1016కు చేరాయి.
ఈ కొత్త కేసులో శ్రీకాకుళంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వెల్లడించారు. కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో కృష్ణాలో 25 కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 14, నెల్లూరు, కడప జిల్లాల్లో నాలుగు, అనంతపురం జిల్లాలో ఐదు, గుంటూరు, ఈస్ట్ గోదావరి జిల్లాలో మూడు చొప్పున నమోదవుతాయి.