గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2023 (19:07 IST)

ఏసీబీ కోర్టుకు చంద్రబాబు.. వాదనలు వినిపించనున్న సిద్ధార్థ లూథ్రా

రాజకీయ కక్షలో భాగంగానే ఏపీ మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేశారని టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. చంద్రబాబును ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపాలి అనేది జగన్ లక్ష్యమని, అందుకే చంద్రబాబును అరెస్ట్ చేశారని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. 
 
ఏపీ సిఐడి అధికారులు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఆరోపణలపై అరెస్టు చేయడంపై ఏపీలో హై టెన్షన్ నెలకొంది. ఇదిలా ఉంటే టిడిపి అధినేత చంద్రబాబును మరి కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరు పరిచనున్నారు. ఏసీబీ కోర్టులో టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి.
 
చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చి చంద్రబాబు కోసం వాదించనున్నారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చి చంద్రబాబు కోసం వాదించనున్నారు.