శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2024 (08:45 IST)

జగన్‌ ప్యాలెస్‌పై షర్మిల కామెంట్స్.. వారి జీవితాలు ప్రమాదంలో వుంటే?

ys sharmila
ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి 2024 ఎన్నికల ఓటమి తర్వాత కష్టాలు తప్పలేదు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న ఆయన సోదరి వైఎస్ షర్మిల.. జగన్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. 
 
ఎన్నికల ముందు నుంచీ ఆ పని చేసిన షర్మిల.. జగన్‌ను గద్దె దించాలనే వ్యవహారంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. తాజాగా అనకాపల్లిలో రియాక్టర్‌ పేలుడు ఘటనపై మాట్లాడిన షర్మిల.. మరో అడుగు ముందుకేసి వైజాగ్‌లో రూ.500 కోట్లతో జగన్‌కు చెందిన విలాసవంతమైన ప్యాలెస్‌పై ఫిర్యాదు చేశారు.
 
ఏపీలోని కూటమి ప్రభుత్వానికి ఇదే తన విజ్ఞప్తి అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గత ప్రభుత్వంలా ఉండకండని.. గత ఏడాది చివర్లో, ఎసెన్షియా ఫార్మాకు సంబంధించిన ఒక నివేదిక తమ ప్లాంట్‌లో అనేక భద్రతా సమస్యలు ఉన్నాయని పేర్కొందనే విషయాన్ని గుర్తు చేశారు. 
 
కానీ వైసీపీ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. తత్ఫలితంగా, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని పక్కనబెట్టి జగన్ రూ. 500 కోట్ల ప్యాలెస్‌లను నిర్మించడంపై దృష్టి పెట్టారని.. అయితే ఫార్మా ప్లాంట్‌లలో భద్రతా ఏర్పాట్లను ఆడిట్ చేయడంలో, సామాన్యుల ప్రాణాలను రక్షించడంలో వారికి ఆసక్తి లేదు. కూటమి ప్రభుత్వం ఈ ప్లాంట్‌ల వద్ద భద్రతాపరమైన చర్యలకు సిద్ధంగా వుండాలని పేర్కొన్నారు.
 
పేద కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు సహాయం చేయాలని షర్మిల విజ్ఞప్తి చేశారు. ఘోరమైన రియాక్టర్ పేలుడుకు వైసీపీ ప్రభుత్వ అవగాహన రాహిత్యమే కారణమని షర్మిల ఆరోపిస్తున్నారు. ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలపై ఆందోళనలు లేవనెత్తుతూ గతేడాది వచ్చిన నివేదికను కూడా ఆమె ఉదహరించారు. ప్లాంట్ వర్కర్ల జీవితాలు ప్రమాదంలో ఉండగా, సొగసైన ప్యాలెస్‌లను నిర్మించాలనే జగన్ ధోరణిని షర్మిల ఎండగట్టారు.