శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 22 ఆగస్టు 2024 (23:08 IST)

దువ్వాడకు జగన్ షాక్: ఇంచార్జి పదవి నుంచి తొలగింపు

Duvvada-Jagan
వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస రావుకి ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బిగ్ షాకిచ్చారు. దువ్వాడను పార్టీ ఇంచార్జి పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో తిలక్‌ను నియమించారు.
 
కాగా ఈమధ్య దువ్వాడ శ్రీనివాసరావు భార్యపిల్లలు అతడి ఇంటిముందు కూర్చుని తమకు న్యాయం చేసేవరకూ అక్కడ నుంచి వెళ్లబోమని భీష్మించారు. దువ్వాడ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారనీ, తమ పరువు తీసే పని చేస్తున్న దువ్వాడపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది తెలిసిందే. ఈ నేపధ్యంలో జగన్ మోహన్ రెడ్డి దీనిపై దృష్టి సారించారు. దువ్వాడను అలాగే కొనసాగిస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని తలచి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.