శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2019 (09:24 IST)

రోజూ ఆ అంకుల్ అలా చేస్తున్నాడు ఆంటీ.. షీ టీమ్స్‌తో చిన్నారి

అభంశుభం తెలియని చిన్నారుల పట్ల కామాంధులు ప్రవర్తించే తీరుపై తెలంగాణ రాష్ట్రంలోని షీటీమ్స్‌కు చెందిన సభ్యులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ అవగాహనలో భాగంగా, ఓ చిన్నారి తన పట్ల ఓ అంకుల్ ప్రతిరోజూ ప్రవర్తిస్తున్న తీరును వివరించింది. దీంతో విస్తుపోయిన షీటీమ్ సభ్యులు.. ఆ కామాంధుడుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఓ ప్రైవేట్‌ స్కూల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఆరో తరగతి బాలికలకు వివరించగా, 11 ఏళ్ల బాలిక స్పందించింది. తమ పక్క ఇంట్లో ఉండే అంకుల్ చేస్తున్న పనులను వివరించింది. 
 
అతనిది బ్యాడ్‌ టచ్‌ అని తనకు ఇప్పుడే తెలిసిందని చెప్పింది. తాను ఇంటికి వెళ్లిన తర్వాత పిలిచి, ఫోన్‌లో వీడియోలు చూపించేవాడని, శరీర భాగాలను తాకేవాడని, ఇంతవరకూ ఈ విషయం ఎవరికీ చెప్పలేదంటూ బోరున విలపించింది. 
 
వెంటనే స్పందించిన షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. ఆ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని రిమాండ్‌కు తరలించారు. గత నవంబరులో మొత్తం 164 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ఇందులో 32,800 మంది పాల్గొన్నారని అధికారులు తెలిపారు.