శుక్రవారం, 8 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (15:47 IST)

గుంటూరులో విషాదం - ట్రాక్టర్ బోల్తాపడి ఆరుగురు మృతి

tractor
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఒక ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని వట్టి చెరుకూరులో ఈ ప్రమాదం జరిగింది. ఈ ట్రాక్టర్ అదుపు తప్పి పంట కాలువలో బోల్తాపడింది. దీంతో ఆరుగురు మృత్యువాతపడగా, మరో 20 మంది గాయపడ్డారు. 
 
మృతి చెందిన ఆరుగురిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురుని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. గాయపడిన వారిని గుంటూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ట్రాక్టరులో సుమారు 40 మంది చేబ్రోలు మండలం జూపూడికి శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులను ప్రత్తిపాడు మండలం డెపాడు వాసులుగా గుర్తించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాగా, గాయపడిన వారిలో అనేక మందికి కాళ్లు చేతులు విరిగిపోయాయి.