Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కుటుంబం ఉసురు తీసిన ఆర్థిక క‌ష్టాలు.. ఆరుగురి ఆత్మ‌హ‌త్య‌

ఆర్థిక కష్టాలు ఓ కుటుంబం ఉసురు తీసింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో ఈ విషాదం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే..

Written By pnr
Updated: సోమవారం, 18 సెప్టెంబరు 2017 (09:17 IST)
ఆర్థిక కష్టాలు ఓ కుటుంబం ఉసురు తీసింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో ఈ విషాదం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
సూర్యాపేట ప‌ట్ట‌ణంలోని స్థానిక క‌స్తూరీ బ‌జార్‌లో నివ‌సించే క‌స్తూరి జనార్దన్ (59) అనే వ్యక్తి కుటుంబం గ‌త కొంత‌కాలంగా ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో కొట్టుమిట్టాడుతోంది. క‌ష్టాలు తీరే మార్గం క‌నుచూపు మేర‌లో క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణయించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పాడు. వారు కూడా ఆయనతో పాటు బలవన్మరణానికి పాల్పడేందుకు సమ్మతించారు. దీంతో కుటుంబంలోని ఆరుగురు క‌లిసి పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. 
 
స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను జ‌నార్ద‌న్‌, చంద్ర‌క‌ళ (50), ప్ర‌భాత (30), అశోక్ (25), సిరి (5), రుత్విక (2)లుగా గుర్తించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. నిన్న‌టివ‌ర‌కు త‌మ మ‌ధ్య ఉన్న వారు తెల్లారేస‌రికి విగ‌త జీవులుగా మార‌డం చూసి ప‌ట్ట‌ణ‌వాసులు క‌న్నీటి పర్యంత‌మ‌వుతున్నారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments