శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 13 జూన్ 2017 (16:02 IST)

తల్లి చేయి విదిలించడంతో.. పాపను కాటేసిన పాము.. గౌనులోకెళ్ళిన పామును తీసేలోపే..?

అమ్మపక్కన హాయిగా నిద్రించిన అభంశుభం తెలియని నాలుగేళ్ల పాప పాముకాటుతో నిద్రలోనే కన్నుమూసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు మండలం, కురుకూటిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వంతల సీతయ్య, నీలమ్మ గిరి

అమ్మపక్కన హాయిగా నిద్రించిన అభంశుభం తెలియని నాలుగేళ్ల పాప పాముకాటుతో నిద్రలోనే కన్నుమూసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు మండలం, కురుకూటిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వంతల సీతయ్య, నీలమ్మ గిరిజన దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు మగబిడ్డలు, నాలుగేళ్ల సునీత ఉన్నారు. రాత్రి భోజనాల తర్వాత సునీత తల్లి నీలమ్మ వద్ద పడుకుంది. 
 
నేలపైనే అందరూ నిద్రిస్తున్నారు. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో తల్లి నీలమ్మపై పాము పాకింది. నిద్రలో ఆమె చేయి విదల్చడంతో ఆ పాము పక్కనే ఉన్న చిన్నారి సునీతపై పడింది. పాము పాప గౌనులోకి వెళ్లింది. చిన్నారి చేయిపెట్టి తీయడానికి ప్రయత్నించడంతో పాము కాటు వేసింది. పాప ఏడుపు విని సునీత తల్లిదండ్రులు లైట్ వేసి చూశారు.
 
వారు కేకలు వేయడంతో పామును స్థానికులు పట్టుకున్నారు. చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తనపై పాకిన పాము తనను బలితీసుకుని వుంటే బాగుండునని తల్లి విలపించడం చూపరులను కలచివేసింది.