ఏపీ బడ్జెట్‌పై సోము వీర్రాజు స్పందన..
ఏపీ బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఈ బడ్జెట్ చూస్తుంటే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తోందన్నారు.
అప్పులు చేసి పథకాలకు పంచేసిందని ఆరోపించారు. పొంతనలేని బడ్జెట్ రూపొందించి ప్రజలను అంకెల గారడీలో మభ్య పెడుతున్నారని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. ప్రాంతాల అభివృద్ధి గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదన్నారు.
అప్పులపై కాగ్ వివరాలు అడిగితే ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి సమాధానం లేదని సోము వీర్రాజు అన్నారు. అప్పుల వివరాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఏ ప్రాంతానికి కేటాయింపులు చేశారో చెప్పాలన్నారు. రాయలసీమ సాగు నీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవన్నారు.
గ్రామీణ ఉపాధి హామీ నిధులు 12 వేలు కోట్లు రూపాయలను ఏపీ అడిగిందని, పోలవరం ప్రాజెక్టుతో సమానంగా గ్రామీణ ఉపాధి హామీ నిధులు ఇస్తున్నామన్నారు.