శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (12:48 IST)

హైకోర్టులో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ - జంబ్లింగ్ విధానానికి నో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరోమారు గట్టి ఎదురుదెబ్బతగిలింది. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ నోటిఫికేషన్ జారీచేసింది. దీనికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పాత విధానంలోనే ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాలంటూ ఆదేశాలు జారీచేసింది. 
 
కళాశాలల్లో ప్రాక్టికల్స్ పరీక్షలు జరపాలని ఆదేశించింది. ఈ పరీక్షలు ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే నెల 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అయితే, గతంలో ప్రటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఈ నెల 8వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించాల్సి వుంది. కాగా, ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1400 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 900 ప్రయోగశాలలను సిద్ధం చేశారు.