శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 ఆగస్టు 2018 (15:24 IST)

భర్త కాదు మానవమృగం : కాలు విరిగి ఆస్పత్రి బెడ్‌పై ఉన్నా... కామ కోర్కె తీర్చమన్నాడు

ఆ భర్త మనిషి కాదు. ఓ మానవమృగం. కట్టుకున్న భార్యను కాలు విరగ్గొట్టడమేకాకుండా, కట్టుకుని ఆస్పత్రిలో బెడ్‌పై నడవలేని స్థితిలో ఉన్నా... నేలపైకి వచ్చి తన కామ కోర్తె తీర్చమన్నాడు. చివరకు పక్కబెడ్ రోగుల బంధు

ఆ భర్త మనిషి కాదు. ఓ మానవమృగం. కట్టుకున్న భార్యను కాలు విరగ్గొట్టడమేకాకుండా, కట్టుకుని ఆస్పత్రిలో బెడ్‌పై నడవలేని స్థితిలో ఉన్నా... నేలపైకి వచ్చి తన కామ కోర్తె తీర్చమన్నాడు. చివరకు పక్కబెడ్ రోగుల బంధువులు చూసి కేకలు వేయడంతో పారిపోయాడు. ఈ దారుణం శ్రీకాకుళం రూరల్  మండలంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
శ్రీకాకుళం రూరల్‌ మండలం కనుగులవానిపేటకు చెందిన జాడ నగేష్ అనే వ్యక్తి తొలి భార్య చనిపోవడంతో ఆమదాలవలస మండలం సోట్టవానిపేట గ్రామానికి చెందిన సుజాతను రెండో వివాహం చేసుకున్నాడు. ఈమెకు తల్లిదండ్రులు లేరు. ఓ సోదరుడు మాత్రమే ఉన్నాడు. మద్యంకు అలవాటున్న నగేష్‌ సుజాతపై తన పైశాచికత్వాన్ని ప్రదర్శించి, ఇంట్లో పిల్లలు ముందే అత్యంత దారుణంగా కామావాంఛ తీర్చమని వేధించేవాడు. 
 
ఈ క్రమంలో సుజాత తండ్రికి బీమా సొమ్ము వచ్చింది. ఈ డబ్బులు తీసుకుని రావాలంటూ నగేష్‌తో పాటు అత్త సరోజిని, ఆడపడుచు మాలతిలు వేధించసాగారు. అందుకు సుజాత నిరాకరించడంతో తినడానికి తిండి పెట్టకుండా అక్రమ సంబంధం అంటగడుతూ ప్రతీనిత్యం ప్రత్యక్ష నరకం చూపించారు. 
 
ఈ వేధింపులు భరించలేని సుజాత తన అక్క వద్దకు వెళ్ళిపోయింది. అయితే, ఈనె 12వ తేదీన భర్త నగేష్‌ అక్కడకు వెళ్లి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. డబ్బులు తెస్తేనే ఇంటికి రావాలని, లేదంటే నీ దారి నువ్వు చూసుకోవాలంటూ మరింతగా బెదిరించాడు. ఏంచేసిన ఆ డబ్బులతో తనకు సంబంధం లేదంటూ తెగేసి చెప్పడంతో మద్యం మత్తులో ఉన్న నగేష్ ఓ బండరాయితో ఆమెను హత్య చేయబోయాడు. దీంతో తప్పించుకునే క్రమంలో ఆమె ఎడమకాలిపై పడటంతో కాలు విరిగిపోయింది. నడవలేని స్థితిలో ఉన్న సుజాతను తన తమ్ముడు దగ్గరిలో ఉన్న జెమ్స్‌ ఆస్పత్రిల్లో చేర్పించాడు.
 
ఆ తర్వాత ఆస్పత్రిలో ఆపసోపాలు పడుతూ వైద్యం పొందుతున్న సుజాతను చూసిన వారంతా అయ్యో... రామా అనే వారే ఎక్కువ. ఇవేవి పట్టించుకోని తన భర్త అక్కడే మృగంలా మారాడు. ఆస్పత్రిలో చేరిన మూడు రోజులు తర్వాత అర్థరాత్రి 12 గంటల సమయంలో నగేష్‌ తన భార్య వద్దకు వెళ్లి అందరూ పడుకున్నారని తన కామ కోర్కె తీర్చాలని పట్టుబట్టాడు. కనీసం నడవలేని స్థితిలో ఉన్న సుజాతను నేలపైకి రావాలంటూ అక్కడే బలవంతం చేయబోయాడు. దీంతో పక్కనే ఉన్న రోగుల బంధువులు కేకలు పెట్టడంతో అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.