మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2023 (11:08 IST)

శ్రీశైలంలో చిరుతపులి కోసం బోను.. చిక్కిన ఎలుగుబంటి

bear catch
శ్రీశైలంలోని అటవీ ప్రాంతంలో శిఖరేశ్వరం సమీపంలో సంచరిస్తున్న క్రూర జంతువులను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ఒక బోనును ఏర్పాటు చేశారు. ఈ బోనులో ఎలుగుబంటి చిక్కింది. దీన్ని శుక్రవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. గత రెండు రోజుల నుంచి శిఖరం సమీపంలో ఎలుగు సంచరించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శిఖరేశ్వరం సమీపంలో మూడు బోన్లను ఏర్పాటు చేశారు. శ్రీశైలం పరిధిలో చిరుత కూడా సంచరించడంతో అటవీశాఖ అధికారులు, భక్తులను డిప్యూటీ డైరెక్టర్ అలాంగ్‌ చాంగ్‌ తెరాన్‌ అప్రమత్తం చేశారు. దీంతో ఎలుగుబంటి బోనులో చిక్కింది. తిరుపతిలో జరిగిన ఘటనల దృష్ట్యాలో శ్రీశైలంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు. అయినప్పటికీ భక్తులు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుని రాకపోకలు సాగించాలని అధికారులు కోరారు.