ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (12:57 IST)

విశాఖ జిల్లాలో వింత కోడిపిల్ల

పక్షి జాతులన్నీ రెండు కాళ్ళతోనే ఉంటాయి.. అదే మూడు లేదా నాలుగు కాళ్లతో జన్మిస్తే.. అది వింతే.. అటువంటి వింత ఒకటి విశాఖ జిల్లా బుచ్చయ్య మండలంలో చోటుచేసుకుంది.

బుచ్చయ్య పేట శివారు నేతవాని పాలెం గ్రామానికి చెందిన వియ్యపు అప్పారావు ఇంట్లో మూడు కాళ్ళతో ఓ కోడిపిల్ల జన్మించింది. తన పెంపుడు కోడి ఇటీవలే పొదిగింది. శనివారం ఉదయం ఆ కోడికి 11 పిల్లల పుట్టాయి.

వాటిలో ఒక కోడి పిల్లకు మూడు కాళ్ళు కలిగి ఉండటంతో ఆయన ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ వార్త క్షణిక కాలంలోనే చుట్టుపక్కల వారికి తెలియడంతో ఆ కోడిపిల్లను చూసేందుకు జనాలు క్యూ కట్టారు. ఎప్పుడూ కనీవినీ ఎరుగని ఆ కోడిపిల్లను అందరూ వింతగా చూస్తూ ఉండిపోయారు.