బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 21 సెప్టెంబరు 2017 (21:21 IST)

కోర్కె తీర్చవూ... టిటిడిలో మహిళా అసిస్టెంటుపై కామపిశాచి...

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలోని టిటిడిలో సేవలందిస్తున్న మహిళా ఉద్యోగినిపై సహోద్యోగి వేధింపులకు పాల్పడ్డాడు. కోరిక తీర్చమంటూ వెంటబడ్డాడు. అటు తల్లిదండ్రులకు, ఇటు పనిచేస్తున్న సంస్థలోని అధికారులకు చెప్పలేక ఆ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.

టిటిడి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సాయిగీతా ఈ నెల 12వ తేదీన సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి లభించింది. పదోన్నతి లభించిందని ఆనందంతో వెళ్ళిన కొన్ని రోజులకే సాయిగీతాకు అక్కడి సూపరింటెండెంట్‌తో వేధింపులు మొదలయ్యాయి. కోరిక తీర్చమంటూ ప్రతిరోజు సూపరింటెండెంట్ వేధించడం మొదలెట్టాడు. 
 
టిటిడి లాంటి సంస్థలో పనిచేస్తుండటం.. బయటకు చెబితే ఉద్యోగం ఎక్కడ పోతుందోనన్న భయంతో విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే సూపరింటెండెంట్ నుంచి వేధింపులు మరింత ఎక్కువవడంతో సాయిగీతా నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం గీతా తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అసలు విషయం తెలుసుకున్న గీతా తల్లిదండ్రులు టిటిడి ఈఓకు సూపరింటెండెంట్ పైన ఫిర్యాదు చేశారు.