బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 జులై 2017 (14:16 IST)

ఉమెన్ ఎంప్లాయీస్‌కు గుడ్ న్యూస్ : ప్రతినెలా 'ఆ' మూడు రోజులు సెలవు

కేరళ కేంద్రంగా ప్రసారాలు కొనసాగిస్తున్న ప్రముఖ టీవీ చానెల్ తమ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగినులకు ఓ శుభవార్త తెలిపింది. తమ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగినులకు ప్రతి నెలా మూడు రోజుల పాటు పీరియడ్ సెలవు

కేరళ కేంద్రంగా ప్రసారాలు కొనసాగిస్తున్న ప్రముఖ టీవీ చానెల్ తమ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగినులకు ఓ శుభవార్త తెలిపింది. తమ సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగినులకు ప్రతి నెలా మూడు రోజుల పాటు పీరియడ్ సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. 
 
కేరళ రాష్ట్రంలో ప్రముఖ మీడియా సంస్థ అయిన మాతృభూమి టీవీ న్యూస్ చానల్ తమ సంస్థలో పనిచేస్తున్న మహిళలకు రుతుస్రావం మొదటిరోజు లేదా రెండో రోజు అదనంగా సెలవు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ఆ గ్రూప్ ఛైర్మన్ ఎంవీ శ్రేమ్యాస్ కుమార్ వెల్లడించారు. 
 
మాతృభూమి మళయాళ టెలివిజన్ న్యూస్ డెస్క్, రిపోర్టింగ్‌లలో ఉన్న 50 మంది మహిళలకు ఈ అదనపు పిరియడ్ లీవ్‌ను బుధవారం నుంచి అమలు చేస్తున్నారు. ఇప్పటికే ముంబైకు చెందిన మీడియా సంస్థ ‘కల్చర్ మెషీన్’ రుతుస్రావం అయిన మొదటిరోజు అదనంగా సెలవును మంజూరు చేస్తున్న విషయం తెల్సిందే.