ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 30 జనవరి 2020 (16:53 IST)

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రూ.లక్ష జరిమానా

సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి రూ.లక్ష జరిమానా విధించింది. సత్వర న్యాయం కల్పించేందుకు గ్రామాల్లో న్యాయ కోర్టుల ఏర్పాటుపై ప్రమాణ పత్రం దాఖలు చేయనందుకుగానూ ఈ జరిమానా విధించింది. న్యాయకోర్టుల ఏర్పాటుకు సంబంధించి ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు గత అక్టోబరు 10న ఆదేశాలు జారీ చేసింది. 
 
అయితే.. ఎందుకు అలసత్వం అవుతోందని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సొసైటీస్ ఫర్ ఫాస్ట్ జస్టిస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు విచారణ చేపట్టిన కోర్టు.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై ఆగ్రహం వ్యక్తం చేసి రూ.లక్ష జరిమానా విధించింది. ఆ జాబితాలో తెలంగాణ కూడా ఉంది. 
 
కాగా, అక్టోబరు 10న జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. 2019 డిసెంబరు 18లోగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు గ్రామ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న చర్యలపై ప్రమాణ పత్రాలు సమర్పించాలి. కానీ, తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు సమర్పించలేదు.