మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (07:29 IST)

జనాభా లెక్కల్లో తప్పుచెబితే జరిమానా?

తమ వివరాలు బయటపడితే అక్రమాలు తేలుతాయని తప్పుడు సమాచారం ఇచ్చేవారికి హెచ్చరిక.. ఇకనుంచి జనాభా లెక్కల్లో తప్పుడు వివరాలు నమోదు చేస్తే జరిమానా విధించాలని కేంద్రం నిర్ణయించింది.

దేశంలో 2021 జనాభా లెక్కలకు సర్వం సిద్ధమయ్యింది. నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రర్‌పై వివాదాలు కొనసాగుతున్న నేపధ్యంలో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకూ ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికీ తిరిగి గణాంక వివరాలు సేకరిస్తారు.

కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సెస్ కోసం సిబ్బంది పర్యటించనున్నారు. ప్రభుత్వ సిబ్బంది అడిగే ప్రశ్నలకు ఎవరైనా తప్పుడు సమాధానం చెప్పారని తేలితే వారికి రూ. 1000 జరిమానా విధించనున్నట్లు సమాచారం.