గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (08:56 IST)

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర? ఇంటివద్ద రెక్కీ : నాదెండ్ల మనోహర్

Nadendla-Pawan
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ హత్యకు కుట్రపన్నినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగానే, హైదరాబాద్ నగరంలోని ఆయన ఇంటివద్ద రెక్కీ నిర్వహిచారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖ పరిణామాల తర్వాత పవన్ కళ్యాణ్ నివాసం, కార్యాలయం వద్ద కొత్త వ్యక్తులు సంచరించడాన్ని గుర్తించామని ఆయన తెలిపారు. 
 
ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి బయటకు వెళుతున్నపుడు తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని కొన్ని అనుమానాస్పద వాహనాలు వెంబడిస్తున్నాయని నాదెండ్ల చెప్పారు. ఆ వాహనాల్లో పవన్ కారును నిశితంగా పరిశీలిస్తున్నారని, వారు అభిమానులు మాత్రం కారని ఆయన వ్యక్తిగత భద్రతా సబ్బంది చెబుతున్నారని తెలిపారు. 
 
మంగళవారం కారులోనూ, బుధవారం బైకులపై పవన్ వాహనాన్ని అనుసరించారని తెలిపారు. అంతకుముందు సోమవారం అర్థరాత్రి ముగ్గురు వ్యక్తులు వచ్చి పవన్ నివాసం వద్ద గొడవ చేశారని ఆయన చెప్పారు. పవన్ ఇంటి వద్ద ఎదురుగా వారు కారు నిలుపగా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకోబోయారని దాంతో బూతులు తిట్టడం మొదలుపెట్టారని ఆయన వివరించారు.