శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 22 ఆగస్టు 2019 (15:24 IST)

ఉద్యోగం కోసం డబ్బు ఇవ్వొద్దు.. వారిని నమ్మొద్దు

ఏపీలో సచివాలయ ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు దళారులు ఉద్యోగార్థులను మోసం చేస్తున్నారన్న వార్త ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. దీనిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఆ దళారుల్ని గుర్తించే పనిలో పడింది. ఇక దీనిపై స్పందించారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. 
 
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల ఎంపికలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారి మాటలు నమ్మి ఎవ్వరూ మోసపోవద్దని సూచించారు. జిల్లా ఎంపిక కమిటీ ద్వారా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల ఎంపిక జరుగుతుందన్నారు. 
 
రాత పరీక్షలో మెరిట్‌ సాధించిన వారికి మాత్రమే ఆ ఉద్యోగాలు దక్కుతాయన్నారు. ఈ ఉద్యోగాల కోసం ఎవ్వరిని నమ్మి డబ్బు ఇవ్వొద్దని ఇస్తే మోసపోవడం ఖాయమన్నారు. అలాంటి వారు ఎవరైనా తారసపడితే జిల్లా ఎస్పీకి గానీ స్థానిక పోలీస్ స్టేషన్‌లో గానీ ఫిర్యాదు చేయాలని సూచించారు.