ఉమ్మడి - పూర్తి స్థాయి మేనిఫెస్టో రూపకల్ప - నేడు టీడీపీ - జనసేన పార్టీ భేటీ
ఉమ్మడి - పూర్తి స్థాయి మేనిఫెస్టో రూపకల్పన కోసం గురువారం విజయవాడ వేదికగా టీడీపీ, జనసేన పార్టీల మధ్య రెండో సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఇటీవల రాజమండ్రిలో తొలి సమావేశం జరిగిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో నేడు మరోమారు ఇరు పార్టీలు మరోమారు సమావేశయ్యాయి. ఇందులో ఉమ్మడి, పూర్తి స్థాయి మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన అజెండాగా సాగుతుంది.
గురువారం విజయవాడలో టీడీపీ - జనసేన సమన్వయ కమిటీ రెండో సమావేశం జరిగింది. నోవోటెల్ హోటల్‌లో జరిగిన ఈ కీలక భేటీకి టీడీపీ నుంచి నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, యనమల, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు తదితర సీనియర్ నేతలు హాజరు కాగా... జనసేన తరఫున నాదెండ్ల, తదితర అగ్రనేతలు విచ్చేశారు.
ఉమ్మడి, పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా నేటి సమావేశం జరిగింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యపోరాటం, ఓటరు జాబితా అవకతవకలపై ఉమ్మడి పోరుకు 100 రోజుల కార్యాచరణకు ప్రణాళిక రూపకల్పన దిశగా చర్చలు సాగాయి.