సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (14:23 IST)

పోలీసులు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు : చంద్రబాబు ధ్వజం

chandrababu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎవరి అండ చూసుకుని రెచ్చిపోతున్నారంటూ ఆయన నిలదీశారు. 
 
పోలీసుల దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు వచ్చిన చిత్తూరు మాజీ మేయర్‌ కఠారి హేమలత కాళ్లపైనుంచి పోలీసు జీపు వెళ్లిన ఘటన రాష్ట్ర00 వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ, ఎవరి అండ చూసుకుని పోలీసులు ఇలా రాక్షసంగా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. వైకాపా కార్యకర్తల్లా మారి తప్పులు చేస్తున్న పోలీసులను వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. 
 
ఈ ఘటనపై పార్టీ తరఫున న్యాయపోరాటం చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక గాడితప్పిన ప్రతి అధికారిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ దయాదాక్షిణ్యాల కోసం కొందరు పోలీసులు ఇంతలా దిగజారి పోయారంటే ఆశ్చర్యంతో పాటు సిగ్గుగా ఉందన్నారు. చిత్తూరులో మేయర్‌ దంపతుల హత్య కేసులో సాక్షులను వేధించి అక్రమ కేసులు పెట్టడంలో అర్థమేంటని ప్రశ్నించారు.