ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2023 (20:18 IST)

ఏపీ కొత్త గవర్నరు నజీర్‌తో 40 నిమిషాలు భేటీ అయిన చంద్రబాబు

chandrababunaidu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నరుతో చంద్రబాబు ఏకంగా 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, నిమ్మకాయల చినరాజప్ప, ఏలూరి సాంబశివరావు, కొనకళ్ల నారాయణ వంటి సీనియర్ నేతలు ఉన్నారు. 
 
తనతో పాటు వచ్చిన పార్టీ సీనియర్ నేతలను కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజాగా రాజకీయ పరిస్థితులతో పాటు పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లినట్టు సమాచారం.