శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 23 నవంబరు 2021 (11:05 IST)

వైసీపీ అరాచ‌కాల‌కు అడ్డుక‌ట్ట వేయండి...కోర్టుకు విన్న‌వించిన టీడీపీ!

కొండపల్లి మునిసిపల్ ఎన్నికలలో వైసిపి అరాచకాలపై చర్యలు తీసుకుని, సజావుగా మునిసిపల్ ఎన్నికలు జరిపించాలని కోరుతూ, టీడీపి హైకోర్టులో వేసిన లంచ్ మోషన్ పై విచారణ మధ్యాహ్నం 12 గం లకు జ‌ర‌గ‌నుంది. కొండపల్లి పురపాలక సంఘం వైసిపి కౌన్సిల్ వార్డ్ సభ్యులపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు.


కొండ పల్లి పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో భాగంగా వైసిపి వార్డ్ కౌన్సిలర్ సభ్యులు నేరపూరిత స్వభావంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వానికి సంబంధించిన రిజిస్టర్ ను కాగితాలను చించ‌డం, ఫ‌ర్నిచ‌ర్ ధ్వంసం చేయడం వంటివి విజువ‌ల్స్ తో సహా కోర్టుకు ఎంపీ కేశినేని నాని స‌మ‌ర్పించారు. 
 
ఎన్నికల అధికారిపై దౌర్జన్యానికి పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, రేపు హైకోర్టు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయనున్నారు. ఈ విధంగా నేరపూరిత వ్యవహరించే ప్రజాప్రతినిధులుగా కొనసాగే అర్హత ఎవరికీ లేదని వారిని వెంటనే అనర్హత వేటు వేయాలని పిల్ లో కోరనున్నారు. వార్డు సభ్యులు వ్యవహరించిన తీరు వీడియో ఫొటోస్ ఎన్నికల అధికారికి నివేదికను పిల్లో పొందు పరచనున్నారు. దీనిపై ఈ మ‌ధ్యాహ్నం కోర్టు తీర్పు ఏం వ‌స్తుంద‌నేది ఉత్కంఠ‌గా మారింది.