టీడీపీ అధినేత చంద్రబాబుకు సోనుసూద్ ఫోనులో పరామర్శ
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బాలీవుడ్ నటుడు సోను సూద్ ఫోనులో పరామర్శించారు. హైదరాబాద్ నగరానికి వచ్చినపుడు మిమ్మలను కలుస్తానని చెప్పారు. పైగా ప్రజా సమస్యలకు వేదిక అయిన అసెంబ్లీ విధ్వంసానికి నిలయంగా మారడం దురదృష్టకరమని సోనుసూద్ అన్నారు. చంద్రబాబుతో ఫోనులో మాట్లాడిన విషయాన్ని సోనుసూద్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. కాగా, ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల అధికార వైకాపా సభ్యులు అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెల్సిందే.
మరోవైపు, చంద్రబాబు నాయుడుపై వైకాపా నేతలు చేస్తున్న కామెంట్స్‌కు నారా రోహిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని చంద్రబాబు తల్లిదండ్రులు దివంగత నారా ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధుల వద్ద నారా రోహిత్ ఆదివారం మౌన నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన పెదనాన్న చంద్రబాబు, పెద్దమ్మ భువనేశ్వరి, అన్న నారా లోకేశ్‌లు క్రమశిక్షణకు మారుపేరన్నారు. ముఖ్యంగా, పెద్దమ్మ భువనేశ్వరి సేవా కార్యక్రమాలే పరమావధిగా పని చేస్తున్నరన్నారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తిపై అన్నెన్ని నిందలు వేయడానికి వైకాపా నేతలకు నోరెలా వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.