గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 మార్చి 2017 (12:01 IST)

నారా లోకేశ్‌కు సూసైడ్ నోట్.. ఇక సెలవు.. సేవ్ టీడీపీ అంటూ తెలుగుదేశం నేత ఆత్మహత్య..

టీడీపీ నేత ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణా జిల్లాలోని జి.కొండూరు మండలం గడ్డమడుగుకు చెందిన అప్పసాని ఈశ్వర్ టీఎన్ఎస్ఎఫ్ (తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్) అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ పార్టీ కోసం అహర్నిశలు

టీడీపీ నేత ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణా జిల్లాలోని జి.కొండూరు మండలం గడ్డమడుగుకు చెందిన అప్పసాని ఈశ్వర్ టీఎన్ఎస్ఎఫ్ (తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్) అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలను టీడీపీ ప్రభుత్వం విస్మరిస్తోందంటూ ఆవేదన చెందాడు. అంతటితో ఆగకుండా టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా  లోకేష్‌కు సూసైడ్ నోట్ రాశాడు.
 
పార్టీ అభ్యున్నతి కోసం జీవితాంతం తాను పని చేశానని... తమకు పదవులు రాకపోయినా బాధపడలేదని అప్పసాని వాపోయారు. పదవి గురించి తాను పట్టించుకోలేదని.. ఐతే ఒకప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారు ప్రస్తుతం పార్టీలో చేరి నానా హంగామా సృష్టిస్తున్నారని అప్పసాని ఆ లేఖలో తెలిపారు. అలాంటి వారికి పార్టీ ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అప్పసాని వ్యాఖ్యానించారు. 
 
ఒకప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పని చేసి, ఇప్పుడు పార్టీలో చేరిన వారి నుంచి పార్టీని కాపాడాలని కోరుతూ సూసైడ్ నోట్ రాశారు. సేవ్ టీడీపీ... ఇక సెలవు అంటూ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, ఈ లేఖను ఫేస్ బుక్‌లో కూడా అప్ లోడ్ చేశారు. అప్పసాని ఆత్మహత్య టీడీపీ వర్గాలకు పెద్ద షాక్ ఇచ్చింది.