మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 జూన్ 2021 (09:54 IST)

టీడీపీ నాయకుల దారుణ హత్య .. శ్మశానానికి వెళ్తుండగా ఘోరం

కర్నూలు జిల్లాలో ఇద్దరు టీడీపీ నాయకులు దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో అన్నదమ్ములను ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి చంపేశారు. పాతకక్షలే హత్యకు కారణంగా తెలుస్తోంది. మృతులు మాజీ సర్పంచ్ ఒడ్డు నాగేశ్వర రెడ్డి, అతని తమ్ముడు, వ్యవసాయ సహకార సంఘం సొసైటీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డిగా గుర్తించారు. శ్మశానానికి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. 
 
తొలుత బొలేరో వాహనాలతో ఢీకొట్టి.. అనంతరం వేటకొడవళ్లతో నరికి చంపేశారు. మూడు రోజుల క్రితం చనిపోయిన సమీప బంధువుకు సమాధి వద్దకు మూడు రోజుల మెతుకులు వేసేందుకు శ్మశానానికి వెళ్తుండగా కాపు కాచి ప్రత్యర్థులు హత్య చేశారు. ప్రత్యర్థుల దాడిలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.