శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (09:21 IST)

యనమలకు బలుపో... బద్ధకమో తెలియదు : తోట రాణి ఫైర్

టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడుపై టీడీపీ ఎంపీ తోట నరసింహం భార్య తోట రాణి మండిపడ్డారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన తమ కుటుంబాన్ని అణగదొక్కేందుకు మంత్రి చినరాజప్ప ప్రయత్నించారని ఆరోపించారు. 
 
తమ కుటుంబానికి చెందిన వారిని అవమానకరంగా సంబోధించారని, మరెన్నో విధాలుగా తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నించారని అన్నారు. మంత్రి యనమల తీరుపై కూడా ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయాలన్న జ్ఞానం లేని జిల్లాలో ఓ పెద్దాయనకు అది బలుపో, బద్ధకమో తెలియడం లేదంటూ చురకలంటించారు. తన భర్త అనారోగ్యంతో ఉంటే కనీసం పలకరించలేదని టీడీపీ నేతలపై మండిపడ్డారు. ఆ పార్టీ నేతల్లో కనీసం మానవత్వం కూడా లేకపోయిందని ధ్వజమెత్తారు.