మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 జనవరి 2023 (14:09 IST)

డెంగ్యూ ఫీవర్ వచ్చినా లెక్క చేయలేదు.. జగన్ సంక్రాంతి వేడుకల్లో...

jagan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. 
 
డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నప్పటికీ సంక్రాంతి ఉత్సవాల కోసం జానపద గీతాలను ఆలపించిన తెలంగాణ జానపద గాయని కనకవ్వ ప్రదర్శన వేడుకలో హైలైట్ గా నిలిచింది. 
 
ఈ సందర్భంగా కనకవ్వ మాట్లాడుతూ.. తాను డెంగ్యూ జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నానని.. అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలవాలని డెంగ్యూ ఫీవర్‌ను లెక్క చేయలేదని చెప్పుకొచ్చారు.