శనివారం, 14 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2022 (16:42 IST)

సీఎం జగన్‌తో దర్శకుడు రాంగోపాల్ వర్మ లంచ్ మీటింగ్

ramgopal varma
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ బుధవారం సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య లంచ్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా వారిద్దరూ దాదాపు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి విజయవాడ తాడేపల్లికి వర్మ బుధవారం ఉదయం చేరుకున్నారు. ఆ తర్వాత సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన వర్మ.. సీఎంతో సమావేశమయ్యారు. 
 
గతంలో సినిమా టిక్కెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఓ సారి అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో వర్మ భేటీ అయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ అయిన దాఖలాలు లేవు. ఇపుడు ఉన్నట్టుండి రాంగోపాల్ వర్మ ఆకస్మికంగా విజయవాడకు వచ్చి ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య తాజాగా రాజకీయ, సినీ అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం.