గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2019 (16:13 IST)

ఢిల్లీ శ్రీవారి ఆలయంలో టెలిఫోన్ కుంభకోణం

టిటిడి సమాచార కేంద్రాలకు టీటీడీ నిబంధనల ప్రకారం కరెంటు టెలిఫోన్ చార్జీలు ఇతరత్రా నిమిత్తం కేవలం 5 లక్షల రూపాయల వరకు మాత్రమే ఖర్చు చేసే అధికారం ఉంది. సంబంధిత బిల్లులను సైతం ఆడిట్‌లో పాస్ చేయించుకోవడం ఆనవాయితీ కానీ ఢిల్లీ లోకల్ అడ్వైజరీ కమిటీకి కేవలం ఒక్క సంవత్సరంలో ఐదు కోట్ల రూపాయలు ఎలా మంజూరు చేస్తారు??? ఆ నిధులు ఎక్కడ, ఎందుకు, ఎవరి అనుమతితో ఖర్చు చేశారు అన్న ఆడిట్ ఇప్పటివరకు ఎందుకు జరగలేదు?? 
 
తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలో అతిపెద్ద ఆడిట్ ఆఫీస్ ఉండగా ఢిల్లీలోని లోకల్ ఆడిట్‌తో ఆడిట్ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది టీటీడీ ప్రధాన గణాంక అధికారి సమాధానం చెప్పాలి?? ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై స్థానిక శ్రీవారి భక్తులు టీటీడీ ఈవో తిరుపతి జేఈవోకు లేఖ రాస్తే ఆ లేఖ ఆధారంగా గత వారం విచారణ నిమిత్తం టీటీడీ ఈవో టీటీడీ ప్రధాన గణాంకాధికారి ఢిల్లీకి వెళ్లి విచారించింది వాస్తవం కాదా??? 
 
మీ విచారణలో అవినీతి బహిర్గతం అయ్యిందా?? లేదా?? ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి సమాచార కేంద్రాలలోని స్థానిక సలహా మండళ్ళను రద్దు చేసిన టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఢిల్లీలోని లోకల్ అడ్వైజరీ కమిటీని మాత్రం ఎందుకు రద్దు చేయలేదు?? టీటీడీ ఉన్నతాధికారులకు ఢిల్లీ ఎల్ఏసీ పై ఎందుకు అంత ప్రేమ?? 
 
టిటిడి ఉద్యోగస్తులపై పెత్తనం చెలాయించే హక్కు అధికారం లోకల్ అడ్వైజరీ కమిటీలకు ఎవరిచ్చారు?? 
ఢిల్లీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూలు పాలు నెయ్యి కుంకుమ కొనుగోళ్లలో అలాగే ఢిల్లీ, నోయిడా, పాట్నా, గుర్గామ్ లాంటి ప్రదేశాలలో జరిగిన శ్రీవారి కళ్యానాలకు ఫ్లెక్సీల పేరుతో ఎన్ని లక్షలు ఖర్చు చేశారు?? 
 
ఆడిట్  జరిగిందా?? లక్షలాది రూపాయలు స్వాహా చేసింది ది వాస్తవం కాదా??  ఢిల్లీలోని శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు,వస్త్రాలను నమోదు చేసే రిజిస్టర్‌లను ఏ ఉన్నతాధికారి అయినా తనిఖీ చేశారా?? అసలు ఒరిజినల్ రిజిస్టరు ఉందా?? ఢిల్లీ హేలీ రోడ్లోని టిటిడి గెస్ట్ హౌస్‌లో ప్రైవేట్ వ్యక్తులకు టీటీడీ చలాన్లు ఇవ్వకుండా కాటేజీలు ఎలా కేటాయిస్తారు?? 
 
ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈ సంవత్సర కాలంలో టీటీడీ కేటాయించిన నిధులు ఎంత?? అక్కడ జరిగిన ఖర్చులపై టీటీడీ ఈవో శ్వేతపత్రం విడుదల చేయాలి!!  అంటూ శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు.