శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (17:05 IST)

తెలుగు అకాడమీ గోల్ మాల్ కేసు.. ముగ్గురు అరెస్ట్

తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఏపీ మార్కంటైల్ మ్యూచువల్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగి మొహినుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఇద్దరు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. 
 
మూడో వ్యక్తిని శుక్రవారం పోలీసులు అదుపులో తీసుకున్నారు. తెలుగు అకాడమీకి చెందిన డబ్బులను ఆ బ్యాంకుకు బదిలీ చేసినట్లు, అక్కడి నుంచి ఒకరి ఖాతాలోకి డబ్బులు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అరెస్టు చేశారు. 
 
కాగా, ఏడాది పాటు తెలుగు అకాడమీ చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులను తీసుకుని వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుదామని అనుకున్నానని, ఆ తర్వాత ఆ మొత్తాన్ని గడువులోపల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో చేరుద్దామని అనుకున్నానని ఇప్పటికే అరెస్టయిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ పోలీసు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.