సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 7 జులై 2019 (11:29 IST)

అమెరికాలో మరో తెలుగు వ్యక్తి మృతి

అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా వాసి ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యాడు. కుటుంబం సమేతంగా ఒక్లహం టర్నర్ జలపాతానికి హాలిడే ట్రిప్‌కి వెళ్లి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి నూనె సురేష్ ప్రాణాలు కోల్పోయాడు.
 
 భార్య ఇద్దరు (పాప, బాబు) పిల్లలతో అమెరికాలోని డల్లాస్‌లో స్థిరపడ్డ నూనె సురేష్... డల్లాస్‌లో సింతెల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సురేష్ మృతదేహానికి స్వగ్రామంలో అంత్యక్రియలు తరలించేందుకు కుటుంబసభ్యుల ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
మృతదేహాన్ని తరలింపుకు దాదాపుగా 80 వేల డాలర్లు అవసరం కావటంతో సహాయం కోసం కుటుంబసభ్యులు, బంధువులు ఎదురు చూస్తున్నారు. 
 
ఇప్పటికే ఫండ్ రైజింగ్ వెబ్‌సైట్‌లో తమకు తోచిన సహాయం అందజేస్తున్న అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారు తెలుగు సంఘాలు, ప్రభుత్వం చొరవ తీసుకొని వీలైనంత తొందరగా సురేష్ మృతదేహాన్ని ప్రకాశం జిల్లలోని స్వగ్రామం తరలించేందుకు సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.