అమెరికాలో ఆ పని కోసం వెళ్ళిన పవన్ కళ్యాణ్‌

pawan kalyan
జె| Last Modified శుక్రవారం, 5 జులై 2019 (20:06 IST)
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ చతికిల పడిన తరువాత పవన్ కళ్యాణ్‌ ఎక్కడా పెద్దగా కనబడలేదు. జనసేన పార్టీ కారణంగా తెలుగుదేశం పార్టీ కూడా బాగా నష్టపోయింది. దీంతో జనసేన పార్టీ నేతలు కూడా ఆలోచనలో పడిపోయారు. పార్టీ పరిస్థితి ఏమవుతుందో తెలియక ఆలోచిస్తూ ఉండిపోయారు.

కానీ పవన్ కళ్యాణ్‌ మాత్రం ప్రజల తరపున పోరాటం చేసేందుకు ఎప్పుడూ సిద్థంగా ఉంటామని, జన సైనికులు ఎక్కడా నిరాశ చెందవద్దని చెప్పారు. దీంతో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. పవన్ కళ్యాణ్‌ అన్నయ్య నాగబాబు కూడా తాను జనసేన పార్టీలో కొనసాగుతానని, కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చాడు.

అయితే ఉన్నట్లుండి పవన కళ్యాణ్‌ అమెరికాలో ప్రత్యక్షమయ్యారు. పవన్ కళ్యాణ్‌ ఒక్కరే అమెరికా టూర్‌కు వెళ్ళారు. కొన్నిరోజుల పాటు అమెరికాలో ప్రశాంతంగా గడపడంతో పాటు పార్టీ బలోపేతంపై అక్కడున్న తన సన్నిహితులతో చర్చించేందుకు పవన్ కళ్యాణ్‌ వెళ్ళినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2024 సంవత్సరం ఎన్నికలకు జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అమెరికాకు వెళ్ళిన పవన్ కళ్యాణ్‌‌కు అక్కడి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు.దీనిపై మరింత చదవండి :