శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (08:45 IST)

కరోనా మరణాలను తగ్గించేందుకు పల్స్‌ ఆక్సిమీటర్ల ద్వారా పరీక్షలు

కరోనా వల్ల మరణాలను తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా అనుమానితులకు పల్స్‌ ఆక్సిమీటర్ల ద్వారా పరీక్షలు నిర్వహించి 94 శాతం కంటే తక్కువ స్థాయిలో ఆక్సిజన్‌ ఉన్నట్టు నిర్థారణైతే వారిని తక్షణం ఆస్పత్రులకు పంపాలని నిర్ణయించింది.

ఈ మేరకు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రతి సచివాలయానికి పల్స్‌ ఆక్సిమీటర్లను పంపాలని, వీలైనంత త్వరగా పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం కోరింది.

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 60 ఏళ్లు దాటిన వారికి ఈ పరీక్షలు చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధా తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించి జిల్లాలోని అన్ని పట్టణ, మండల అధికారులకు ఆదేశాలు వచ్చాయి. సాధారణంగా ప్రతి వ్యక్తిలో ఆక్సిజన్‌ శాతం 95 నుంచి 99 వరకూ ఉండాలి.