బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 27 జులై 2020 (09:49 IST)

అమెరికాలో మళ్లీ నిరసనలు

అమెరికాలోని పోర్టుల్యాండ్‌లో నల్లజాతీయులపై ఫెడరల్‌ పోలీసుల దుర్మార్గాలకు వ్యతిరేకంగా మళ్లీ నిరసనలు ఊపందుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో దాష్టీకానికి ఆస్టిఆస్టిన్‌లో ఓ నిరసనకారుడ్ని పోలీసులు కాల్చి చంపారు.

ట్రంప్‌ ప్రభుత్వం పంపిన ఫెడరల్‌ ఏజెంట్లు నిరసనకారులను అకారణంగా అరెస్టులు చేసి జైళ్లకు పంపుతున్నారు. దీనిపై ఆగ్రహించిన నిరసనకారులు సియాటెల్‌లోని హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

ఫెడరల్‌ పోలీస్‌ అధికారులు నిరసనకారులపై ఉక్కుపాదం మోపారు. ఈ ఘర్షణల్లో 45 మంది నిరసనకారులను అరెస్టు చేశారు. అనేక మంది గాయపడ్డారు.

పోర్టులాండ్‌లోనే కాదు, లాస్‌ ఏంజెల్స్‌, పోర్టులాండ్‌, ఓక్లాండ్‌ తదితర పట్టణాల్లో కూడా నల్లజాతీయుల నిరసనలపై పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగించారు.