శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 10 మార్చి 2020 (08:35 IST)

84వ రోజుకి చేరిన రాజధాని ఆందోళన

రాజధాని రైతుల ఆందోళనలు 84వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 84వ రోజు సైతం రిలే దీక్షలు నిర్వహించనున్నారు.

పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, ఉండవల్లి రాయపూడి, నేలపాడు, పెదపరిమితాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. మిగతా రాజధాని గ్రామాల్లోనూ కొనసాగుతున్న రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
 
సర్కారు అణచివేత చర్యలు
వారంతా భూమాతను నమ్ముకుని సిరులు పండించారు. తరతరాలుగా తమతో అనుబంధం పెనవేసుకున్న పొలాల్ని అయిదు కోట్ల ఆంధ్రుల ప్రజా రాజధాని కోసం ఇచ్చారు.

అలాంటి రాజధానిని అక్కడినుంచి తరలిస్తామంటే కడుపు మండి రోడ్డెక్కారు. మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి నిద్రాహారాలు మానుకుని.. ఆవేదన స్వరం వినిపిస్తున్నారు.

ఆ ఆవేదన స్వరాలు.. నిరసన గళాలపై ప్రభుత్వం కేసుల జులుం ప్రదర్శిస్తోంది. అమరావతి పరిరక్షణ ఉద్యమం ప్రారంభమైన రెండున్నర నెలల్లో ఒకరో.. ఇద్దరో కాదు.. 3వేల మంది ఉద్యమకారులపై 92 కేసులు పెట్టింది. 
 
ప్రధానంగా ఈ అభియోగాలతోనే కేసులు
 • సీఆర్‌పీసీ సెక్షన్‌ 144, భారత పోలీసు చట్టం సెక్షన్‌ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నా వాటిని ఉల్లంఘిస్తూ ర్యాలీలు, పాదయాత్రలు, ప్రదర్శనల్లో పాల్గొన్నారని.. 
• పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించటం, వారిపై దాడి చేయటం, వారిని కించపరిచేలా నకిలీ వీడియోలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పెట్టారని.. 
• ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని, రాస్తారోకోతో రాకపోకలకు అంతరాయం కలిగించారని.. 
• అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారని.. 
• ముందస్తుగా నిర్బంధించకపోతే నేరానికి పాల్పడే అవకాశముందని.. 
• అనుమతులు లేని సభలు, ర్యాలీల్లో పాల్గొనేందుకు ప్రయత్నించారని.. 
• సీఆర్‌పీసీ సెక్షన్‌ 154 
• నేరం చేసే అవకాశముందన్న ఉద్దేశంతో ముందస్తు నిర్బంధం ఐటీ చట్టంలోని పలు సెక్షన్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదయ్యాయి.